Artical 1

సినిమా  స్క్రిప్ట్ అండ్ స్క్రీన్ ప్లే నాలెడ్జి కి సంబంధించిన 

వీడియోస్ కావాలంటే క్రింది వీడియోస్ చూడండి...





సినిమా కధలు ఎలా పుడతాయి ?

పురాణాల నుండి ..చారిత్రాత్మక  అంశాల నుండివార్తల నుండి ..నిత్యం  జరిగే  సంఘటనలు,ప్రోగ్రామ్స్  నుండి ..అనుభవాల నుండికాన్సెప్ట్ నుండి
 ఫిలోసఫీ  నుండిఫాంటసి నుండి …. సినిమాల నుండి….లొకేషన్ నుండి
సహజ విరుద్ద  పాత్రల ద్వారా (వెరయిటీ క్యారెక్టర్ )  .. కధలు పుట్టవచ్చు…

పురాణాల నుండి వచ్చిన కధలు :

ముత్యాల ముగ్గు

రామాయణ కధ ను  పూర్తిగా  సోసలయజ్ చేసి ముత్యాల ముగ్గు ని రాసారు ..ముళ్ళ పూడి ...రావణాసురుడి క్యారెక్టర్ ని కాంట్రాక్టర్  క్యారెక్టర్ గా మార్చారు ... పాత్ర కు కొత్త గా రాసిన మాటలు ఎవర్ గ్రీన్ .. కళా కండం మూలా కధ  పురాణమే .. అంటే  పురాణాలూ  చదవి  మన పరిస్తితులకు అనుగుణం గా  కధ లు అల్లుకోవచ్చు ..టాలెంట్ ఉండాలే గాని ఎన్ని కధలయినా సృష్టించవచ్చు ..పైగా  పురాణాలూ కాపీ కొడితే  ఎవ్వరు ఏమి అనరు ...టాలెంటెడ్ ఫెల్లో  అంటారు ...

మనవూరి పాండవులు :

భారతాన్ని   చేసి  ఐదుగురు యువకులతో  కధ అల్లారు  బాపు -రమణ లు ..ఇదీ పురాణమే ..
పురాణాన్ని ప్రస్తుత పరిస్తితికి అన్వయించుకోవాలి ..ఎలా వాడాలో తెలియాలి ... కిటుకు కనిపెట్టాలి ..
 
గమ్యం :

  "మోటార్ సైకిల్ డైరీస్ " అనే హాలీవుడ్  సినిమా వుంది ..అందులో మోటార్ సైకిల్ మీద  ఇద్దరు ఫ్రెండ్స్  ఒక దేశం చుట్టి వస్తారు .. చిన్న లైన్ ని తీసుకుని ..రామాయణం కాన్సెప్ట్ ని  కలిపి కధ తాయారు చేసాడు  క్రిష్ .రామ్ (శర్వానంద్ ),జానకి ( కమలిని ముఖర్జీ ),గాలి శ్రీను (అల్లరి నరేష్ ) లు రాముడు ,సీత ,ఆంజనేయుడి కి ప్రతీకలు ...మద్యలో ఎన్నో సంఘటనలతో అల్లాడు కధని..స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకున్నాడు ..అంతే ..

దళపతి

కుంతీ పుత్రులు అయిన  కర్ణుడు ,అర్జునుడు ... మరియు  దుర్యోధనుల  కధ ను  తీసుకుని  నేటి పరిస్తుతులకు అనుగుణం గా కధ రాసుకున్నాడు మణిరత్నం ..కర్ణుడు -రజిని కాంత్ ,అర్జునుడు-అరవింద్ స్వామి ,దుర్యోధనుడు -మమ్ముట్టి .....సూపర్ హిట్ సినిమా ..

రోజా

సతీ సావిత్రి కధ ను నీట్ గా   ఉగ్రవాదాన్ని  జోడించి మణిరత్నం క్లాసిక్ ఇచ్చాడు ..తన భర్త ను కాపాడుకునే ఇల్లాలి పాత్ర ను .. కాలానికి  అడాప్ట్ చేసుకుని కధ రాసాడు ..అవార్డు లు కొట్టాడు ...

మాట్రిక్స్

కృష్ణ -అర్జున మధ్య జరిగే  గీతా సారమే  సినిమా కధ ..తనకు శక్తి లేదని అనుకునే హీరో -నియో (ఆండర్ సన్ )..ఇది అర్జునుడి పాత్ర ...నీదగ్గరే శక్తులున్నాయని అనే వాడు మార్ఫియస్ ..ఇది కృష్ణుడి పాత్ర ... పురాణాల్లో ని పాత్ర షేడ్స్ హీరో కి పెడితే సినిమా లు కచ్చితం గా హిట్ అవుతాయి ..

అపరిచితుడు

గరుడ పురాణం  కాన్సెప్ట్  ,మన సమాజం లో వున్న బాధ్యతా రాహిత్యం ..తప్పులు ..దీని కలిపితే "అపరిచితుడు " అనే శిక్షలు వేసే  క్యారెక్టర్  ..అంతే ... ఐడియా కి సీన్ లు ,ట్విస్ట్ లు , వేరే క్యారెక్టర్ లు ఇలా అలొచిస్తూ పోతే కధ వచ్చేస్తుంది ...

వార్తల నుండి వచ్చిన కధలు :

జెంటిల్ మాన్ :

 ఉద్యోగం రాలేదని  ఒక యువకుడు  చేయి నరుక్కున్నాడు ..ఫిజికల్ హాండీ కాపెడ్  అయితే  వుద్యోగం వస్తుందని అలా చేసాడట --- వార్త  పేపర్ లో చదవిన  శంకర్ ..మన విద్యా వ్యవస్తలో  వున్నా చీకటి కోణాన్ని   జెంటిల్ మాన్ కధ గా మార్చాడు ..ఈ Raw idea మనం ఫ్లాష్ బ్యాక్ లో చూస్తాం .. అంటే న్యూస్ పేపర్ సరిగ్గా చదివినా  ప్లాట్స్ , Raw Idea లు దొరుకుతాయి ..

ఐతే :

 "ఒసామా బిన్ లాడెన్  ని నలుగు కుర్రాళ్ళు పట్టుకుంటే " అనే కాన్సెప్ట్  ఆలోచనే  ఐతే  సినిమా కి ప్రేరణ ..దానికి మంచి కధ,కధనం  రాసుకున్నాడు చంద్రశేఖర్ ఏలేటి ..."అన్ని సినిమాలు ఒకేలా వుండవు " అని ఎంత ధైర్యం  వుంటే  పుబ్లిసిటీ పోస్టర్స్  మీద  వాడతాడు ...అందుకే  అది చిన్న సినిమాలకు ప్రేరణ గా ఇప్పటికీ నిలిచింది ..

అంతః పురం :

 "నాట్ వితౌట్ మై డాటర్ " అనే నవల వుంది ..అది ఇరాన్  సినిమా గా తెసారు ..దీన్ని ఇండస్ట్రీ లో చాలామంది చూసారు ... ప్లాట్ వాడాలని అనుకునే వారు ..అయితే ఒకసారి "శ్ర్రీ రాములయ్య " షూటింగ్ లో బాంబు బ్లాస్ట్  పరిటాల రవి మీద జరిగింది ..అప్పుడు ఫాక్షనిజం అనే మాట పేపర్లో వచ్చింది ..వెంటనే కృష్ణవంశీ కి ఐడియా తట్టింది .. ప్లాట్ ని ఫాక్షనిజం  బ్యాక్ డ్రాప్ లో పెట్టాడు ..కధ అల్లాడు ..8 నంది అవార్డు లు కొట్టాడు .. 

చారిత్రాత్మక  అంశాల నుండి వచ్చిన కధలు :

మురారి :

ఇందిరా గాంధీ  కుటుంభం లో వరసగా అందరు మరణించారు ...ఇందిరా గాంధీ ని  కాల్చి చంపారు ...తన భర్త ఫిరోజ్ గాంధీ  అనుమానాస్పద మరణం ..తర్వాత ఇందిరా గాంధీ పెద్ద కొడుకు సంజయ్ గాంధీ  పైలెట్ గా విమానం నడుపుతూ మరణించాడు ..చివరిగా  రాజీవ్ గాంధీ  బాంబు బ్లాస్ట్ లో మరణించాడు ..ఇలా ఒకే కుటుంభానికి చెందిన వ్యక్తుల మరణం ఎందుకు జరిగింది ? ఏమయినా శాపం వుందా ? వుంటే అదేమిటి ?  ఇలాంటి ఆలోచనలతోనే " మురారి " కధ పుట్టింది  కృష్ణవంశీ  కి . చారిత్రాత్మక అంశాలతో  మూల కధ సృష్టి ..

నిత్యం  జరిగే  సంఘటనలు, ప్రోగ్రామ్స్  నుండి వచ్చిన కధలు :

సిరివెన్నెల :

కే . విశ్వనాధ్  గారు  ఫిజికల్ హాండీ కాపెడ్ వాళ్ళకి  సంబంధించిన  పోగ్రాం కి వెళ్లారట .. పోగ్రాం ని చూసి అందులో  రెండు క్యారెక్టర్ లు -ఒక గుడ్డి వాడు ,ఒక ముగా అమ్మాయి  ని తీసుకుని  ..వాళ్ళ బిహేవియర్ ,తెలివితేటలు  తెరకు ఎక్కిస్తే  అన్న ఆలోచనే  సినిమా కి పునాది ...అంటే    పోగ్రాం  చూసినా ,వెళ్ళినా ,చదివినా  అక్కడ నుండి క్యారెక్టర్  లు పుట్టి  కధ గా మారొచ్చు ...

సాగర సంగమం

కమల్ హాసన్ డేట్స్ దొరికాయి ..కధ కావాలి ..అప్పుడు కే.విశ్వనాధ్  గారు కమల్ లోని డాన్సర్ టాలెంట్ కు తగిన విధం గా కధ ఆలోచించారు ..నాట్యం లో భరతనాట్యం ,కూచిపూడి ,ఒడిస్సీ ,మణిపురి  ..ఇలా అన్నింటిని  కలిపి "ఇండియన్ డాన్స్ " అని చేసే యువకుని క్యారెక్టర్ ని అల్లి ..కధ గా మార్చారు ..అంటే  హీరో డేట్స్ వున్నాయి కదా అని కధ పడితే కధ రాసుకోలేదు ..తన బాణీ అయిన సంస్కృతీ , సంప్రదాయాలను మేళవించి పవిత్రమైన కధ రాసారు .. అలాంటి "  Raw idea " ముఖ్యం .. దాన్ని విస్తరిస్తూ పోవాలి ...మంచి కధ గా మలచు కోవాలి ...ఇది చాలా కష్టం ..కాని కష్ట పడాలి తప్పదు..

అనుభవాల నుండి వచ్చిన కధలు :

హ్యాపీ డేస్

ఇంజనీరింగ్ కాలేజీ  లో చదువులు స్నేహాలు ,ప్రేమలు , టూర్లు ..ఇలా మన అనుభవాలను కాస్త రంగరించి మంచి స్క్రిప్ట్  చేసుకున్న  సినిమా హిట్ అవుతుంది . అనుభవాలు స్క్రీన్ మెడ వర్క్ అవుట్ అయ్యేలా  క్యారెక్టర్ లు, సీన్ లు ..మార్చి రాసుకోవాలి ...అంతే ఫీల్ గుడ్  మూవీ  తయారవుతుంది ..అదే శేఖర్ కమ్ముల చేసాడు ..

ఫిలోసఫీ  నుండి వచ్చిన కధలు :

స్వయం కృషి

"మనం ఎంతెత్తు  కు ఎదిగినా మన మూలాల్ని మర్చిపోకూడదు " అనే ఫిలోసఫి ని నమ్మే  కే.విశ్వనాధ్  గారు ... ఫిలోసఫి నే హీరో క్యారెక్టర్  కి ఆపాదించి ..చెప్పులుకుట్టి ,పైకి ఎదిగే  చిరంజీవి క్యారెక్టర్  డిజైన్ చేసారు ....దానికి తగిన కధ అల్లారు ..అంటే  నమ్మిన ఫిలోసఫిల నుండి కూడా క్యారెక్టర్ , కధ  లు పుట్టవచ్చు ...

నలుగురు

డబ్బు కి -విలువలకి  మద్య ఎప్పుడూ గొడవే ..మనిషి సతమతం అయ్యేది ఇక్కడే ..మంచి-చెడ్డ  వర్గీకరణ  వీటి ద్వారానే కలుగుతుంది .. వాటి ని ఎలా బాలన్స్ చేయాలి  అని -ఒక  రఘురాం (రాజేంద్ర ప్రసాద్ ) అనే క్యారెక్టర్ ని సృష్టించి కధను నడిపారు ..ఇలా ఫిలోసఫి ని తీసుకుని  క్యారెక్టర్ లు అల్లి ,సంఘటనలు సృష్టించి  కూడా కధ రాయవచ్చు ...

ఫాంటసి నుండి వచ్చిన కధలు :

జగదేక వీరుడు -అతిలోక సుందరి

ఒక అందమైన  దేవకన్య  భూలోకం రావాలి " ఇది కాన్సెప్ట్ . ఎందుకు రావాలి ? రీజన్  ఏమిటి ?  భూలోకం లో ఎలాంటి వారుంటారు ? హీరో దగ్గరే  హీరోయిన్  ఎందుకు వుండాలి ? విలన్ లు ఎలాంటి వారుండాలి ? ఇలా ఆలోచిస్తూ  కధ ను పూర్తి చేసారు ..ఒక ఉంగరం ( ప్లాట్ డివైస్ ) ద్వారా  కధ అల్లారు ...ఇది పూర్తిగా కల లాంటిది ...ఫాంటసీ  పాయింట్ ...కాని నిజం అని నమ్మించారు ...కాబట్టి ఫాంటసీ  పాయింట్  లు సరిగ్గా వర్క్ అవుట్ చేస్తే హిట్ అవుతాయి ...దాన్ని నమ్మించేలా కధ ,కధనం .సీన్ లు ఉండాలే జాగర్త పడాలి ..("ఈగ " కూడా  ఇటువంటిదేగా )...

సినిమాల నుండి వచ్చిన కధలు :

శత్రువు

రామ్ గోపాల్ వర్మ  తీసిన ట్రెండ్ సెట్టింగ్ సినిమా "శివ "..దాన్ని స్పూర్తి పొంది  కోడి రామ కృష్ణ గారు  "శత్రువు " తీసారు ..అంతే ఒక్కోసారి క్లాసిక్  సినిమా నుండి  ఇంకొక రకం సినిమా లు  పుట్టొచ్చు ..అలోచించలే గాని  అన్నీ అద్భుతాలే ..

పెళ్లి పుస్తకం :

 "మిస్సమ్మ " సినిమా లో పెళ్లి  అయ్యిందని అబద్దం చెప్పి  హీరో, హీరోయిన్  అయిన ఎన్.టి .ఆర్ ..,సావిత్రి లు  ఉద్యోగాలు చేస్తారు .. పాయింట్ ని రివర్స్  చేసారు ...పెళ్లి పుస్తకం లో  పెళ్లి అయిన రాజేంద్రప్రసాద్ ,దివ్యవాణి  లు పెళ్లి అయినా కానట్టు ఒకే ఆఫీస్ లో  పని చేస్తారు ..ఇది  Raw Idea ...అలా ఎందుకు హీరో,హీరోయిన్  చేయాలి ? ఏమా పరిస్తితులు ?  ఏమిటా కధ ? అని మిగిలినది అల్లు కోవాలి ...అంటే ఒక సినిమా చూసి  ఇంకో సినిమా రాసుకోవచ్చు ..

నాయకుడు /సర్కార్ /సర్కార్ రాజ్ /గాయం /నేటి సిద్ధార్థ  :

ఇటువంటి సినిమాలకు మూల కధ ..."గాడ్ ఫాదర్  " అనే హాలీవుడ్ సినిమా ...హాలీవుడ్ క్లాసిక్ సినిమా లు చుస్తే  వాటిని అంత తేలిక గా మర్చిపోలేము ..ఎంత తవ్వుకుంటే అంత అన్నట్టు   వీటి నుండి  ప్లాట్స్,కధ,కధనం,సీన్ లు ప్రపంచమంతా  ఎత్తేస్తున్నారు ..కానీ  ఎత్తిన ప్లాట్,సీన్ లు మన భారత దేశ పరిస్తితులకు సరిపోయేలా మలచుకోవాలి ..మలచలేదో సినిమా ఎగిరిపోతుంది ...

లొకేషన్ నుండి  వచ్చిన కధలు :

చాందిని బార్

స్నేహితుడి తో కలసి  ఒక బార్ కెళ్ళాడు  మధుర బండార్కర్ .అక్కడ  అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు ,కస్టమర్స్  వెర్రి గా డబ్బులను వాళ్ళ మీద చల్లుతున్నారు ..అది చూసి ..గమనించి ..దాన్నే సబ్జెక్టు  గా తీసుకుని  ..ఒక డాన్సర్ అమ్మయి కధ రాసుకున్నాడు ...నేషనల్ అవార్డ్  కొట్టాడు .. అదే పంధాలో  రిసెర్చ్ చేస్తూ  నేటివిటీ వున్నా కధ లు రాసుకుంటూ ,తీస్తూ  ముందుకెళ్ళి పోతున్నాడు ..మీ చుట్టూ జరిగే  వాటిని ఓబ్సేర్వ్  చేసినా కధలు పుడతాయి ..

కాన్సెప్ట్ నుండి వచ్చిన కధలు :

ఒకే ఒక్కడు :

 "ఒక్క రోజు  సి.ఎమ్ అయితే " అనే కాన్సెప్ట్  అందరం అనుకుంటాం ..అయితే  అలా జరగా లంటే  ఏమి సంఘటనలు జరగాలి ?  హీరో ఎక్కడ వుంటే అవుతాడు ? సి.ఎమ్ అయిన తర్వాత ఒక్క రోజులో ఏమి చేస్తాడు ? చేసాక ఏమి జరుగుతుంది ? ఇదంతా అలోచించి రాసుకున్నాడు కాబట్టే  అంత హిట్ అయ్యింది ..ఇది వామనుడు-బలి చక్రవర్తి కధ ..

కొండవీటి దొంగ

పెద్దోల్లను దోచి పేదోళ్లకు ఇవ్వడం అనే రాబిన్ హుడ్  కాన్సెప్ట్ .దేన్నీ తీసుకుని పరిస్తితులు కల్పించి  ఒక . .ఎస్  ను దొంగ గా మార్చి హిట్ చేసారు ..(ఇదే "జెంటిల్ మాన్ ..కిక్  లోను చూస్తాం )


సహజ విరుద్ద  పాత్రల ద్వారా (వెరయిటీ క్యారెక్టర్ )  వచ్చిన కధలు :

ఆర్య ,మన్మథుడు ,మిస్టర్ పర్ఫెక్ట్ ,కిక్  --ఇలాంటి కొత్త క్యారెక్టర్ లు   తట్టగానే  ఫస్ట్ క్యారెక్టర్ ని డిజైన్  చేసుకుని ..తనకు ఇబ్బంది కలిగించే పరిస్తితుల్లోకి క్యారెక్టర్ ని నెట్టాలి ..అప్పుడు క్యారెక్టర్ ఇబ్బంది నుండి  ఎలా బయట పడతాడు ? మంచి సీన్ లు ..మంచి కొత్త ప్రేమ కధ రాసుకోవాలి ..క్యారెక్టర్ కొత్త గా వుందా ..కధ కుడా బాగా వచ్చిందా ...సీన్ లు పేలాయా ..సినిమా హిట్ అవుతుంది ...లేదా ఫట్ అవుతుంది ..వీటితో జాగర్త గా వుండాలి ..తెలివితేటలు,సైకాలజీ ,వాదం--వితండ వాదం చొప్పించాలి ...

టైటిల్  పెట్టి  కధ ఆలోచించవచ్చు--- .వి .వి .సత్యనారాయణ  గారు ఇలానే  రాస్తారు ...

Suggestion :

డైరెక్ట్ గా కాపీ  --పేస్టు  చేస్తే తప్పు ..గానీ ..స్ఫూర్తి పొందడం  తప్పు కాదు ... దాన్నుండి  కొత్తగా ఆలోచించడం అసలు తప్పుకాదు ..

సినిమా కధ మొదట  చిన్న ఐడియా  గా వస్తుంది ..దాన్ని రాసి పెట్టుకోవాలి ..దానికి సరిఅయిన క్యారెక్టర్  లు ,సంఘటనలు సృష్టించాలి ...తర్వాత ట్విస్ట్ లు కల్పించాలి ..మంచి సీన్ లు రాసుకోవాలి ..చివరిగా స్క్రీన్ ప్లే  బాగుండేలా చూసుకోవాలి ..

0 comments:

Post a Comment